ఏపీలో కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. సోమవారం కొత్తగా మరో 75 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలియజేశారు. వీటిలో చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లా 16, కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లా 4, కడప జిల్లా 3, తూర్పుగోదావరి జిల్లా 2 కేసులు నమోదయ్యాయి. ఈ 75 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 92మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 20మంది చనిపోయారు.
రాష్ట్రంలో కేసుల్లో కర్నూలు జిల్లా 174 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.