కరోనా వైరస్ బారిన పడి అనంతపురం జిల్లా పరిగికి చెందిన ఏఎస్ఐ (51) మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. రెండు రోజుల క్రితం మరణించారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఏఎస్ఐ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. రూ. 50 లక్షల పరిహారాన్ని ప్రకటించి, ప్రగాఢ సంతాపం తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఎస్ఐ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతపురం జిల్లా, హిందూపురానికి చెందిన ఏఎస్ఐ గత మూడు సంవ్సతరాలుగా పరిగి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే పోలీస్ అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉండగా 20 రోజుల క్రితం ఆయనకు నలతగా ఉండటంతో పరిగి ఎస్‌ఐ ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించి ఇంటికి పంపించారు. అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి, లాక్ డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని విధులకు హాజరైయ్యారు. దీంతో పరిగి ఎస్సై అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అతనిని కొనాపురం పికెట్ దగ్గర డ్యూటీకి పంపించారు. విధులు నిర్వర్తిస్తూ మాస్కుల పంపిణీ మొదలైన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కరోనాతో ఏఎస్ఐ మృతి.. సీఎం జగన్ కీలక నిర్ణయం