ఈ దేశాల ప్రయాణీకులపై నిషేధం

. ఆప్ఘనిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాల నుంచి భారత్‌కు ప్రయాణీకుల రాకను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూర్తిగా నిషేధించింది. ఈనెల 31 వరకూ ఇది అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా ఐరోపా దేశాలు, టర్కీ, బ్రిటన్‌ ప్రయాణీకులపై కూడా భారత్‌ ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ విమానయాన సంస్థ ఈ దేశాలకు చెందిన ప్రయాణీకులను భారత్‌కు వెళ్లే తమ విమానాల్లోకి అనుమతించవు. మరోవైపు కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే ఇద్దరు బాధితులు మృతి చెందగా.. తాజాగా మూడో మరణం నమోదవడం కలకలం రేపుతోంది. వైరస్‌ కారణంగా మహారాష్ట్ర ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (64) మంగళవారం మరణించారు