మహమ్మారి కరోనా వ్యాప్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ దిశగా అడుగులు సమర్థవంతంగా వేయడంలేదని తెలుస్తోంది. ఇక వైరస్ బారినపడినవారికి చికిత్స అందించడం ఎంత ముఖ్యమో.. అనుమానితులను గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం అంతకంటే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. లేదంటే వైరస్ వ్యాప్తి మనుషుల మధ్య తీవ్రమై కోలుకోలేని నష్టాన్ని మిగుల్చుతుందని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు.ఇక చైనా తర్వాత కోవిడ్ కోరల్లో చిక్కిన దక్షిణ కొరియా.. సమగ్రమైన వైరస్ నిర్ధారణ పరీక్షలతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగిందనేది తెలిసిందే. అక్కడే డ్రైవ్-ఇన్ టెస్టులు కూడా నిర్వహించారంటే వారి అప్రమత్తత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై పోరుకు మనదేశం వెంటనే చేపట్టాల్సిన ఐదు చర్యలివేనని కొందరు వైద్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా: భారత్ గట్టేక్కాలంటే వీటిని పాటించాల్సిందే